Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో మరో దారుణం, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై 5 మంది అత్యాచారం, కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు

ఓ బాలికపై కొన్నిరోజులుగా ఇద్దరు మైనర్లు సహా అయిదుగురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన (Another minor held over teen’s gang rape) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Image used for representational purpose only | (Photo Credits: ANI)

Hyd, June 7: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన మరచిపోకముందే తెలంగాణ రాజధానిలో మరో దారుణం (Hyderabad Gang Rape) చోటు చేసుకుంది. కార్ఖానాలో బాలికపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ బాలికపై కొన్నిరోజులుగా ఇద్దరు మైనర్లు సహా అయిదుగురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన (Another minor held over teen’s gang rape) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ సోమవారం అర్ధరాత్రి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే బాలిక పదవ తరగతి చదువుతోంది. అదే తరగతికి చెందిన విద్యార్థితో పరిచయం ఉంది.

ధీరజ్, రితేష్ అనే యువకులతో బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రోజూ మాట్లాడుతూ బాలికతో చనువు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఒక రోజు హోటల్ గదికి రప్పించి బాలికపై వీరిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోలు(Videos) తీసి.. బెదిరిస్తూ రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం జరుపుతూ నరకం చూపిస్తున్నారు.

ఈ సారి నెక్లెస్ రోడ్డులో.., మైనర్ బాలికపై కారులోనే అత్యాచారం, నిందితుడు అరెస్ట్, 'జూబ్లీహిల్స్‌ అత్యాచారం' వీడియోలను వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్

ఇక ఇటీవల ఆ వీడియోలు ఇచ్చేస్తాం రమ్మని నమ్మబలికి మరోసారి లాడ్జ్‌కి పిలిచి తన మిత్రులతో సైతం బాలికపై ధీరజ్ రేప్ చేయించాడు. రెండు నెలలుగా బాధితురాలు ఈ విషయాల గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ మానసికంగా కృంగిపోతుండటంతో తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళారు. తనపై రెండు నెలలుగా జరుగుతున్న అత్యాచారానికి సంబంధించిన అన్ని విషయాలను ఆమె సైక్రియాటిస్ట్ వద్ద వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మే 30న కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనస్థలిపురం, ఎల్బీనగర్‌ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మైనర్‌ బాలురు, ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేశారు.