Image used for representational purpose only | (Photo Credits: ANI)

Hyd, June 6: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం (Hyderabad Gang Rape Case) పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన (uploading video clip) పాతబస్తీకి చెందిన సుభాన్​ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.​ ఈ ఘటనకు సంబంధించి నిందితుల ఫొటోలు, వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు‌కు అవి ఎలా చేరాయో ఆరా తీస్తున్న పోలీసులు అతనిపైనా.. కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో మరో దారుణం, మైనర్ బాలికపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రోజుకో మలుపు తిరుగుతున్న జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ కేసులో కీలక నిందితుడైన ఉమేర్‌ఖాన్ (18)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నా ధ్రువీకరించాల్సి ఉంది. మరికొందరు మాత్రం అతడు ఇంకా పరారీలోనే ఉన్నాడని చెబుతున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల కస్టడీ కోసం పిటిషన్ వేయాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్‌లు, బయటకు వస్తున్న కీలక అంశాలు, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఫేర్‌ వల్ పార్టీ కోసం రూ. 2లక్షలతో పబ్ బుక్ చేసుకున్నట్లు వెల్లడి

ఈ పరిస్థితులు ఇలా ఉంటే..రాష్ట్ర రాజధానిలో మరో ఘాతుకం జరిగింది. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అత్యాచార ఘటన చర్చలో ఉండగానే.. మరొక ఘటన వెలుగు చూసింది. మైనర్‌పై కారులోనే లైంగిక దాడికి తెగబడ్డాడు ఓ కామాంధుడు. పుట్టినరోజు పార్టీకి అని పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు సురేష్‌ను సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు.