TS,AP High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు రూ. 3 వేల జరిమానా, రిటైర్ట్ ఉద్యోగుల విషయంలో ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్
నవంబర్ 1, 2018కి ముందు పదవీవిరమణ పొందినవారు ఏ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకొనే ఆప్షన్ ఇవ్వకుండా ఉమ్మడి హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను స్పెషల్ హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పుబట్టింది. ఉద్యోగులకు ఆప్షన్ వినియోగించుకొనే హక్కును కల్పించనందుకు ఏపీ, తెలంగాణ హైకోర్టులు (TS,AP High Courts) వేర్వేరుగా ఒక్కొక్క పిటిషనర్‌కు రూ.3 వేల చొప్పున వారి ఖర్చులకు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.
Hyderabad,August 30: రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు తెలంగాణ స్పెషల్ హైకోర్టు డివిజన్ బెంచ్ జరిమానా (TS,AP High Courts Fined Row) విధించింది. నవంబర్ 1, 2018కి ముందు పదవీవిరమణ పొందినవారు ఏ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకొనే ఆప్షన్ ఇవ్వకుండా ఉమ్మడి హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను స్పెషల్ హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పుబట్టింది. ఉద్యోగులకు ఆప్షన్ వినియోగించుకొనే హక్కును కల్పించనందుకు ఏపీ, తెలంగాణ హైకోర్టులు (TS,AP High Courts) వేర్వేరుగా ఒక్కొక్క పిటిషనర్‌కు రూ.3 వేల చొప్పున వారి ఖర్చులకు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.
2018కి ముందు రిటైర్ అయినవారి ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకొని, వారు కోరినవిధంగా ఏపీ హైకోర్టుకు (AP high court) కేటాయించాలని తెలిపింది. వారి రిటైర్‌మెంట్ వయస్సును 60 ఏండ్లుగా పరిగణించి.. రావాల్సిన జీతభత్యాలు లెక్కించి చెల్లించాలని ఆదేశించింది.
ఉమ్మడి హైకోర్టులో (United AP High Court) రిటైర్ అయిన ఉద్యోగి కే బలరామరాజు, మరో 9 మంది హైకోర్టు విభజనలో భాగంగా ఏపీ హైకోర్టుకు వెళ్లేందుకు తమకు ఆప్షన్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ 2019లో తెలంగాణ, ఏపీ హైకోర్టులను ఆశ్రయించారు. తమను ఏపీ హైకోర్టుకు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. అయితే రెండు హైకోర్టుల్లో వారి పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. వారికి క్వారంటైన్ నిబంధనల్లో సడలింపు, తెలంగాణలో కొత్తగా 2,924 మందికి కరోనా, రాష్ట్రంలో 1,23,090కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య
వారి పిటిషన్లపై విచారణచేపట్టిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టీ అమర్‌నాథ్‌గౌడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఉమ్మడి హైకోర్టులో రిటైర్ అయిన పిటిషనర్లకు ఆప్షన్ హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన జూన్ 2, 2014వ తేదీని ఉద్యోగుల కేటాయింపునకు అపాయింటెడ్ డేగా పరిగణనలోకి తీసుకోవాలే తప్ప రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పడిన జనవరి 1, 2019వ తేదీని కాదని పేర్కొన్నది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పిటిషనర్లను ఏపీ హైకోర్టుకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.