Telangana Assembly Budget Session 2024: ఫిబ్రవరి 10న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్, టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదిగో
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
Telangana Assembly Budget Session 2024 Live Updates: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు.అధికారమున్నదని హద్దు పద్దు లేక. అన్యాయమార్గాల నార్జింపబూనిన .అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అచ్చి వచ్చే రోజులంతమైనాయి!’’ అంటూ గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వెల్లడించారు.పెద్దఎత్తున మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపడతామని.. ఆ నది మరోసారి హైదరాబాద్ జీవనాడిగా మారుతుందని చెప్పారు.ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులతోపాటు అప్పటి మన్మోహన్ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..
ప్రత్యేకించి సోనియాగాంధీ షోషించిన పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటివరకూ 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. పాలమూరు-రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాం. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పాటిస్తుంది. గత ప్రభుత్వం నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశాం. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యతో పాటు ఉద్యోగమూ సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తాం. 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు, గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.