Telangana Assembly: కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్, హరీష్ ఆకారం పెరిగింది తప్ప తెలివి పెరగలే?, కోమటిరెడ్డి వర్సెస్ హరీష్..డైలాగ్ వార్

బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడగా మాటల యుద్ధం నెలకొంది. హరీష్ వర్సెస్ శ్రీధర్ బాబు, హరీష్ వర్సెస్ భట్టి విక్రమార్క, హరీష్ రావు వర్సెస్ కోమటిరెడ్డి, హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది.

Telangana Assembly budget sessions,Komatireddy Venkatreddy Vs Harishrao

Hyd, July 27: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడగా మాటల యుద్ధం నెలకొంది. హరీష్ వర్సెస్ శ్రీధర్ బాబు, హరీష్ వర్సెస్ భట్టి విక్రమార్క, హరీష్ రావు వర్సెస్ కోమటిరెడ్డి, హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది.

కాంగ్రెస్‌ నాడు ప్రతిపక్షంలో ఏ హామీలను అయితే విమర్శించిందో ఇప్పుడు అదే హామీలతో ఆదాయాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించేందుకు రెడీ అయ్యారని దుయ్యబట్టారు. ఇక ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధానప్రతిపక్ష నేత కేసీఆర్..చీల్చి చెండాడుతానంటే తాను ఉదయం 9 గంటల నుండి ఎదురుచూస్తున్నానని చెప్పగా సభలో సభ్యులంతా నవ్వారు. ఆ తర్వాత కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ కోమటిరెడ్డి చేసిన మాటలతో ఒక్కసారిగా సభలో హీట్ పెరిగిపోయింది.

హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే ఆకారం పెరిగింది తప్పితే తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు డమ్మి మంత్రి, డమ్మి అల్లుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మామ దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండా? లేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఇక హరీశ్ రావు అబద్ధాలతో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదని, లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారని మండిపడ్డారు. గొర్రెల స్కీం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని, ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు, మీరు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మిర్రో లెక్క తీద్దాం అన్నారు.

Here's Video:

కాంగ్రెస్ పార్టీ అంటేనే ధోకా పార్టీ అని , ప్రతి మహిళలకు నెలకు 2500- ధోకా,రైతు భరోసా కింద రైతన్నకు,కౌలు రైతుకు 15 వేలు -ధోకా,డిసెంబర్ 9 న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ - ధోకా,25 వేల పోస్టులలో మెగా డిఎస్సీ - ధోకా,వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు -ధోకా,నిరుద్యోగ భృతి -ధోకా,ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం -ధోకా,మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ -ధోకా,అవ్వా, తాతలకు 4వేల ఫించన్ -ధోకా,ఆటో డ్రైవర్లకు 12 వేల ఆర్థిక సాయం -ధోకా,ప్రతి రోజూ సీఎం ప్రజాదర్బార్ -ధోకా, కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద ధోకా అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా బడ్జెట్‌ పై సభలో హరీష్ ప్రసంగం మాటల యుద్ధానికి దారి తీసింది. హైదరాబాద్‌ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్

Here's Video:



సంబంధిత వార్తలు