Kasani Gnaneshwar Resigns: తెలంగాణ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్, పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా, బీఆర్ఎస్‌లో చేరనున్నట్లుగా వార్తలు

ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే టీడీపీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించానని తెలిపారు.

Kasani Gnaneshwar resigns from Telangana TDP

Hyd, Oct 30: తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే టీడీపీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించానని తెలిపారు.తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్‌ కోరుతున్నారని.. లోకేష్‌కు 20 సార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.

‘‘తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విషయమై ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యి చర్చించారు. ఈ చర్చల్లో ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించారు. దీంతో ఇప్పటికే అనేకసార్లు తమ పార్టీ పోటీ ఉంటుందని, 30 మందితో అభ్యర్థుల తొలి జాబితా కూడా రెడీ ఉంటుందని కాసాని ప్రకటించారు.

బీఎస్పీ సంచలనం, తెలంగాణ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ ఇచ్చిన బీఎస్పీ, 43 మందితో రెండో జాబితా విడుదల

అయితే, చంద్రబాబును కలిసినాక అనూహ్యంగా పరిస్థితి తారుమారు కావడంతో కాసాని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకున్నది.

kasani-gnaneshwar-letter

కాసాని మాట్లాడుతూ... పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టకోకపోగా... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.



సంబంధిత వార్తలు