Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..
సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.
Hyd, Dec 17: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. నేటి ప్రశ్నోత్తరాల సమయంలో అప్పులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎమ్ రుణాలు ఎంతో చెప్పాలంటూ హరీష్ రావు ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని భట్టి తెలిపారు. అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై హరీష్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది అవాస్తవమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం కింద తీసుకున్న అప్పులు రూ. 51 వేల 277 కోట్లు. ఈ రోజు ఉదయం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు కూడా తీసుకున్నాను. ఈ రోజుకు కలిపితే ఇంకో రూ. 3 వేల కోట్లు పెరిగింది. అంటే ఎఫ్ఆర్‌బీఎం కింద రూ. 55, 277 కోట్లు తీసుకున్నట్లు రిపోర్టు ఉంది. కార్పొరేషన్ గ్యారెంటీల కింద రూ. 61,991 కోట్లు, మరో రూ. 10,099 కోట్లు గ్యారెంటీలు లేకుండా తీసుకున్నారు.
మొత్తంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు ఎంతంటే రూ. 1,27,208 కోట్లు.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హరీశ్‌రావు తెలిపారు.బీఆర్ఎస్ హయాంలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పుకొచ్చారు. గోరంతను కొండత చేసి గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు.రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం అంతా తప్పు అని సభ ద్వారా చెబుతున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.
Telangana Assembly Session 2024
హరీశ్ రావుకు ఎప్పుడు నిజం చెప్పే అలవాటు లేదు... ప్రతిదీ రాజకీయం కోసమే మాట్లాడుతాడు
-- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క#TelanganaAssembly
• @Bhatti_Mallu pic.twitter.com/0sjHSUUPns
హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు. భట్టి సవాల్‌ను స్వీకరిస్తున్నామని.. అప్పులపై చర్చకు సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు.
ఇక రేవంత్ ప్రభుత్వంపై తాము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ అనుమతించాలని సభలో హరీష్ రావు కోరారు. ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న అప్పులకు, వాస్తవ అప్పులకు తేడా ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై భట్టి మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ సభ్యులా మాపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది. బీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. గడిచిన పదేళ్లు బీఏసీ ఎలా నిర్వహించారో మర్చిపోయారా? గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడూ పాటించాలి కదా ఎవరైనా రూల్స్ బుక్ ప్రకారమే నడవాలి’’ అని మంత్రి భట్టి వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక విధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు నీతులు మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు.
పెండింగ్ బిల్లులు గురించి మాట్లాడుతున్నారని..రూ. 40 వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని తెలిపారు. ప్రతి గింజా తామే కొంటామని సివిల్ సప్లయ్‌లో 18 వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. హరీష్ రావుకు ఎప్పుడు నిజాలు మాట్లాడే అలవాటు లేదని.. హరీష్ రావు అబద్ధాలు చెబితే అలవాటులో పొరపాటు అనుకున్నామన్నారు. శాసనసభ వ్యవహారాల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అప్పులు ఆస్తుల విషయంలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హరీష్ రావు సవాళ్లు స్వీకరిస్తున్నాను చర్చకు నేను రెడీ’’ అని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.