తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం కింద తీసుకున్న అప్పులు రూ. 51 వేల 277 కోట్లు. ఈ రోజు ఉదయం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు కూడా తీసుకున్నాను. ఈ రోజుకు కలిపితే ఇంకో రూ. 3 వేల కోట్లు పెరిగింది. అంటే ఎఫ్ఆర్‌బీఎం కింద రూ. 55, 277 కోట్లు తీసుకున్నట్లు రిపోర్టు ఉంది. కార్పొరేషన్ గ్యారెంటీల కింద రూ. 61,991 కోట్లు, మరో రూ. 10,099 కోట్లు గ్యారెంటీలు లేకుండా తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు ఎంతంటే రూ. 1,27,208 కోట్లు.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హరీశ్‌రావు తెలిపారు.
Harish Rao on Debts
#Hyderabad---
Updates from #Telangana
Assembly
"The Congress government has incurred a debt of Rs 1,27,208 crore in its one year ruling in the state. If this continues, the debt to be incurred in five years will be Rs 6,36,040 crore, " said @BRSparty #Siddipet MLA… pic.twitter.com/dLpgQ078s1
— NewsMeter (@NewsMeter_In) December 17, 2024
Deputy CM Bhatti on Debts
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటివరకు తీసుకున్న అప్పుల వివరాలను శాసనసభ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తాము అధికారం చేపట్టినప్పటి నుంచి 2024 నవంబర్ వరకు రూ.51 వేలకోట్లను రుణాలుగా తీసుకున్నామని వెల్లడించారు. pic.twitter.com/EaC9aIxsI7
— ChotaNews (@ChotaNewsTelugu) December 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)