Telangana Assembly: ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, మంత్రులు, చెప్పిన‌ట్లుగానే అసెంబ్లీకి రాని బీజేపీ ఎమ్మెల్యేలు, అనారోగ్యంతో స‌భ‌కు దూరమైన మాజీ సీఎం కేసీఆర్

ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు.

CM Revanth Reddy (photo-X)

Hyderabad, DEC 09: తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy), తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు.

 

ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు.

 

మరోవైపు, శాసనసభ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) గైర్హాజరు అయ్యారు. సీనియర్‌ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

 

ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయరని తేల్చిచెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు.