Revanth Reddy Vs Sabitha Indrareddy: కంటతడి పెట్టిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అక్కను నమ్మితే మోసం తప్పదని సీఎం రేవంత్ కామెంట్, తీవ్రంగా ఖండించిన సబితా
సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..కేటీఆర్‌కు కీలక సూచన చేశారు. కొంతమంది అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి.
Hyd, July 31: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..కేటీఆర్‌కు కీలక సూచన చేశారు. కొంతమంది అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి.
దీనికి కౌంటరిచ్చారు సబితా. తాము ఏం మోసం చేశాం... ఎవరిని ముంచామో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో పార్టీలోకి రా తమ్ముడు... భవిష్యత్‌లో ముఖ్యమంత్రివి అవుతావని అని చెప్పానన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి తనను టార్గెట్ చేస్తున్నారని... తనపై ఇంత కక్ష ఎందుకని విచారం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఇంటిమీద వాలిన కాకులను తన ఇంటిమీద వాలితే కాల్చేస్తానని చెప్పిన రేవంత్.. ఇప్పుడు చేస్తుంది ఏంటో చెప్పాలన్నారు. మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు సబితా. భట్టి విక్రమార్క సీఎం కావాలి, సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామన్న కేటీఆర్, వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు
మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిందని..ఇది మోసం చేయడం కాదా అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తనకు కాంగ్రెస్ టికెట్ వచ్చాక ఇంఛార్జీగా ఉండి గెలిపిస్తానని చెప్పిన సబితా..మంత్రి పదవి కోసం పార్టీ మారడం మోసం చేయడమేనని వెల్లడించారు. ఇక భట్టి విక్రమార్క సైతం సబిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఒక దళితుడిని ప్రతిపక్ష నాయకుడిని చేస్తే సహించలేక పార్టీ మారిందని దుయ్యబట్టారు. సభా నాయకుడిపై సబిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మొత్తంగా సబితా వర్సెస్ రేవంత్ రెడ్డిగా సాగిన మాటల యుద్దం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.