Telangana Assembly Session: భట్టి విక్రమార్క సీఎం కావాలి, సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామన్న కేటీఆర్, వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు
ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్‌రేట్, మహిళలపై అత్యాచారాలు, పెట్టుబడులు,కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీంల కొనసాగింపు వంటిపై మాటల యుద్ధం నెలకొంది.
Hyd, July 31: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఏడోరోజు ప్రారంభమయ్యాయి. ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్‌రేట్, మహిళలపై అత్యాచారాలు, పెట్టుబడులు,కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీంల కొనసాగింపు వంటిపై మాటల యుద్ధం నెలకొంది.
భవిష్యత్‌లో భట్టి సీఎం కుర్చిలోకి వెళ్లాలని మనసార కొరుకుంటున్నట్లు తెలిపారు కేటీఆర్. భట్టి విక్రమార్క ఇలానే మరింత ఉన్నతిని సాధించాలని, భవిష్యత్‌లో పక్క కుర్చీ(సీఎం సీటు)లోకి పోవాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. భట్టికి ఆ అర్హత ఉందన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో శుష్క ప్రియాలు ,శూన్య హస్తాలు, గ్యారెంటీలకు టాటా, లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా,డైవర్షన్ల మేళా, హామీ పత్రాలకు పాతర,జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు మూడు తిట్లు.. ఆరు అబద్దాలతో పాలన సాగుతుందన్నారు కేటీఆర్.
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టించటం సరైంది కాదన్నారు. సభ వాయిదా పడగానే సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ వెళ్దామని.. ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు అక్కడి నిరుద్యోగులు చెప్పినా.. తాను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. అలాగే ఏ ఒక్కరూ ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పినా సిటీ సెంట్రల్ లైబ్రరీలో సీఎం రేవంత్ రెడ్డికి పౌర సన్మానం చేయిస్తామన్నారు.
కేటీఆర్ మాటలను తప్పుబట్టారు మంత్రి సీతక్క. గత పదేళ్లు అధికారంలో ఉండి ఉస్మానియా వర్సిటీకి పోలేని పరిస్థితి తెచ్చుకున్నారన్నారు. ఇందుకు సంబంధించి కోట శ్రీనివాసరావు సినిమాలో కోడి కథను వినిపించారు. బీఆర్ఎస్ మాటలు చూస్తే అలాగే ఉందన్నారు.
పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామన్నాం... ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే నిర్ణయాత్మక నిర్ణయాలకు సహకారం అందిస్తాం అని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్‌పై పత్రికల్లో రకరకాల వార్తలు వస్తున్నాయని వీటిపై ప్రభుత్వం స్పందించాలన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బయోడేటా ఇదే..