Redya Naik on Revanth Reddy: భూమికి మూరెడు ఉంటడు ఆ బోసి.. కే, రేవంత్ రెడ్డిపై బూతులతో విరుచుకుపడిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్

ప్రతిపక్షాలను అసభ్య పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

BRS Dornakal MLA DS Redya Naik (Photo-Facebook)

Hyd, April 25: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నోరు జారారు. ప్రతిపక్షాలను అసభ్య పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్‌కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతర ల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ ఇలాంటి మాటలు మాట్లాడటంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి.

మూడు నెలల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించండి, కేసీఆర్ సర్కారుకి హైకోర్టు ఆదేశాలు

ఓటు అడిగే హక్కు ఎవరికి లేదని.. అన్నీ చేసిన తమకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు తనను విమర్శించే ధైర్యం లేదన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేసిన రేవంత్.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూమికి మూరెడు ఉంటడని.. బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లు చేయడమే రేవంత్ నైజం అంటూ ఆరోపణలు చేశారు.

రాహుల్ గాంధీనీ సస్పెండ్ చేస్తే ఓ పీసీసీ చీఫ్ గా రేవంత్ కనీసం నిరసన కార్యక్రమాలు చేయలేదని ఎద్దేవా చేశారు. అదే తానయితే రాష్ట్రంలో హల్ చల్ చేసేటోడినంటూ రెడ్యా నాయక్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయనను దించాలని చూస్తున్నారన్నారు.



సంబంధిత వార్తలు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి