Telangana Budget 2024: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌, ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.2024-25 గాను తెలంగాణ బడ్జెట్‌ రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది

Telangana Budget (Photo-Video Grab)

Hyd, July 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.2024-25 గాను తెలంగాణ బడ్జెట్‌ రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. తెలంగాణ అప్పులు పదేళ్లలో రూ.75,577 కోట్ల నుంచి రూ. 6,71,751 కోట్లకు పెరిగాయన్నారు.

మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్యశ్రీకి ఇచ్చే మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని, రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నారు. అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి ఆపడం లేదన్నారు. రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనమే అన్నారు.  తెలంగాణ బడ్జెట్ హైలైట్స్,ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత,వ్యవసాయానికి పెద్దపీట

రైతులు పండించే సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు.

మొత్తం తెలంగాణ బడ్జెట్ ఇలా..

తెలంగాణ బడ్జెట్: రూ.2,91,159 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.2,20,945 కోట్లు

మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు

పన్ను ఆదాయం: రూ.1,38,181 కోట్లు

పన్నేతర ఆదాయం: రూ.35,208 కోట్లు

కేంద్రపన్నుల్లో వాటా: రూ.26,216 కోట్లు

కేంద్రం గ్రాంట్లు: రూ.21,636 కోట్లు

ఏ పథకానికి ఎంత?

రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం: రూ.723 కోట్లు

గృహజ్యోతి పథకం: రూ.2,418 కోట్లు

ఉద్యానవనం: రూ.737 కోట్లు

పశుసంవర్ధక శాఖ: రూ.1,980 కోట్లు

విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ: రూ.100 కోట్లు

హైదరాబాద్ నగర అభివృద్ధి: రూ.10 వేల కోట్లు

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు: రూ.500 కోట్లు

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు: రూ.1500 కోట్లు

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు: రూ.1525 కోట్లు

మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్సుపోర్ట్ సిస్టమ్: రూ.50 కోట్లు

ఔటర్ రింగ్ రోడ్డు: రూ.200 కోట్లు

మెట్రో వాటర్ వర్క్స్: రూ.3,385 కోట్లు

హైడ్రా: రూ.200 కోట్లు

జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పన: రూ.3,065 కోట్లు

హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన: రూ.500 కోట్లు

ప్రజాపంపిణీ: రూ.3,836 కోట్లు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.29,816 కోట్లు

బీసీ సంక్షేమం: రూ.9,200 కోట్లు

వైద్యం, ఆరోగ్యం: రూ.11,468 కోట్లు

ట్రాన్స్‌కో, డిస్కంలు: రూ.16,410 కోట్లు

అడవులు, పర్యావరణం: రూ.1,064 కోట్లు

ఎస్టీ సంక్షేమం: రూ.17,056 కోట్లు

మైనార్టీ సంక్షేమం: రూ.3,003 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం: రూ.2,736 కోట్లు

ఎస్సీ సంక్షేమం: రూ.33,124 కోట్లు

ఐటీ రంగం: రూ.774 కోట్లు

నీటి పారుదల శాఖ: రూ.22,301 కోట్లు

ఆర్ అండ్ బీ: రూ.5,790 కోట్లు

పరిశ్రమల శాఖ: రూ.2,762 కోట్లు

విద్యారంగం: రూ.21,292

హోంశాఖ: రూ.9,564 కోట్లు

వ్యవసాయం: రూ.72,659 కోట్లు

ఇందిరా మహిళా శక్తి పథకం: రూ.50.41 కోట్లు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Hyderabad double murder case: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

KTR At ED Office: ఈడీ విచారణకు కేటీఆర్...పోలీసుల భారీ బందోబస్తు, మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసు ఒకటి అని స్పష్టం చేసిన మాజీ మంత్రి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Share Now