Telangana: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, ప్రాణం పోతుందని తెలిసి కూడా 50 మంది ప్రయాణికులను రక్షించాడు, ఖమ్మంలో విషాదకర ఘటన
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చింది.
Bus driver dies of heart attack while driving: ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చింది.
అప్పటికే రన్నింగ్‌లో ఉన్న బస్సును కల్లూర్ పాత బస్టాండ్ సమీపంలో నిలిపి ప్రయాణికుల సాయంతో సమీప కల్లూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ రావును వైద్యుడు పరీక్షిస్తుండగానే మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు.
స్కూల్లో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి, ఈ విషాదకర ఘటనపై డాక్టర్లు ఏమన్నారంటే..
తనకు గుండెపోటు వస్తున్న విషయాన్ని గమనించి బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కాపాడారు డ్రైవర్ శ్రీనివాస రావు.డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బస్సులోని 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడు శ్రీనివాస రావు వేంసూరు మండలం, రామన్నపాలెం గ్రామానికి చెందిన వాడు, అతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.