Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, మూసీ నది పునరుజ్జీవంపై ప్రధాన చర్చ ..మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయంపై రానున్న క్లారిటీ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టుపై మంత్రివర్గంలో చర్చ, పునరావాసితులకు సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు.
Hyd, Oct 26: తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టుపై మంత్రివర్గంలో చర్చ, పునరావాసితులకు సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు.
ఫ్యూచర్ సిటీ / ఫోర్త్ సిటీ లో మునుముందు చేపట్టాల్సిన ప్రైవేటు ప్రాజెక్టులు, ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు అంశంపై చర్చ జరగనుంది. ఫోర్త్ సిటీ వరకు వచ్చే ఏడాది కాలంలో రోడ్డు రవాణా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోనుండగా దాదాపు 120 కిమీ మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయంపై చర్చ, వాటికి ఆమోదం తెలపనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్ రావుల పాస్ పోర్టు రద్దు
Here's Tweet:
ఇల్లు లేని నిరుపేదలకు గూడు వసతి కల్పించే లక్ష్యంతో "ఇందిరమ్మ ఇళ్లు" పెద్ద ఎత్తున గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నిర్మించేందుకు అవసరమైన చర్యలు ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉంది. అలాఏగ జీవో 317 పై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై చర్చ జరగనుంది.