Telangana Cabinet Meeting: కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ, రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కసరత్తు, తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు.

Telangana Cabinet Meeting (photo-ANI)

Hyd, Mar 12: తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు.ఈ సమావేశంలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. మొదటి విడతగా 4.56లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించాం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఓఆర్‌ఆర్‌ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్‌ సౌకర్యం. 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపు

జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ. వంద రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో 93శాతం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని మంత్రులు మీడియాకు వివరించారు.

ముదిరాజ్‌, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, మేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈబీసీలకు రెడ్డి కార్పొరేషన్‌తో పాటు వైశ్య, మైనార్టీ, సంత్‌సేవాలాల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారు.గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ తెలంగాణ కేబినెట్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ అమీర్ అలీఖాన్‌ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మరోసారి గవర్నర్‌ తమిళిసైకి పంపించాలని మంత్రివర్గం తీర్మానించింది.

43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల, అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులు ప్రకటన

ఓఆర్‌ఆర్‌ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్‌ సౌకర్యం. 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పిస్తాం. జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ. వంద రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన చేసింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో 93శాతం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని మంత్రులు వివరించారు.

పదవులు, అదికారం శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని కల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలతో(Six Guarantees) పాటు ఇతర హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. అలాగే త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు(New ration cards) పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.