Telangana Cabinet Meeting Updates: తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ, ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు ఇవిగో..

వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను టీజీగా మార్పు చేసేందుకు అంగీకారం తెలిపింది.రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను క్యాబినెట్ నిర్ణయించింది.

cm revanth reddy

Hyd, Feb 4: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్‌ తీర్మానాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 2లక్షల ఉద్యోగాల భర్తీకి నేటి నుంచి ప్రక్రియ మొదలైందని వివరించారు. గత పాలనలో రాచరిక పోకడలే తప్ప.. తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించలేదని మండిపడ్డారు.

తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను టీజీగా మార్పు చేసేందుకు అంగీకారం తెలిపింది.రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను క్యాబినెట్ నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘ చర్చ. రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయం తీసుకుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు, నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్

రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం తీసుకుంది.అలాగే అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపింది.కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ సమావేశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం నాడు తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై శాసనసభ, మండలి ఉమ్మడి సమావేశాలు పెట్టడానికైనా రెడీ అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 48 గంటలు కాకపోతే 2 రోజులు కంటిన్యూ చేయడానికైనా రెడీగా ఉన్నామన్నారు. బట్టలు పట్టుకొని సమావేశాలకి రమ్మని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం తరపున తాను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతామన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు సమస్యలపై ఎంత సేపయినా అసెంబ్లీలో మాట్లాడవచ్చన్నారు. వారిద్దరూ మాట్లాడినంత సేపు ఒక నిమిషం కూడా మైక్ కట్ చేయమని అన్నారు. కేసీఆర్‌కు చిత్త శుద్ది ఉంటే సమావేశాలకు తప్పకుండా రావాలని హితవు పలికారు. ఎవరు తెలంగాణను ముంచారో తేల్చుదామని సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా రావాలన్నారు. కాలునొప్పి, కంటి నొప్పి అని కేసీఆర్ డ్రామాలు చేయొద్దని అన్నారు.

వీడియో ఇదిగో, కేసీఆర్‌ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున్ సాగర్‌ను జగన్ ఆక్రమించుకుంటుంటే ..

ప్రాజెక్టులపై రెండు రోజులు చర్చిద్దామన్నారు. కేసీఆర్‌కు అధికారం పోయాక ఎక్కడ నొప్పి పుడుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశాడని... దాన్ని తిరగరాసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలను కేంద్రప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని.. ఇప్పటి నుంచి ప్రతి సమావేశానికి వెళ్లి తమ వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ లంకె బిందెలాగా ఉండేది.. కానీ కల్వకుంట్ల కుంటుంబం దోచుకొని మట్టి బిందెను పెట్టారని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని గజదొంగలంటారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు