Telangana: సీఎం కేసీఆర్ నాగ‌ర్‌ క‌ర్నూల్ పర్యటన, పలు కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

పలు కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేశారు.నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాలకు సీఎం ప్రారంభోత్సవాలు చేశారు.

Telangana CM Chandrasekhar Rao (Photo Credits: ANI)

Hyd, June 6: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. పలు కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేశారు.నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాలకు సీఎం ప్రారంభోత్సవాలు చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన తెలిసిందే. ఆయా జిల్లాలకు అన్నిహంగులతో సమీకృత కలెక్టరేట్లను నిర్మించేందుకు నిర్ణయించారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్‌ చౌరస్తాలో 12ఎకరాల సువిశాల స్థలంలో 1.25లక్షల చదరపు అడుగుల స్థలంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తుల్లో నిర్మాణమైంది. సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. రూ.52కోట్లతో కలెక్టరేట్‌ నూతన భవనం నిర్మాణమైంది. ఇక్కడే 32శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు.. 2.41 లక్షల కోట్లకు.. జాతీయ సగటు కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వృద్ధి

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. తెలంగాణ త‌ల్లికి పూల‌మాల వేసి దండం పెట్టారు. పార్టీ ఆఫీసు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, జైపాల్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

రూ.52 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌, రూ.35 కోట్లతో చేపట్టిన పోలీసు భవన సముదాయాల‌ను కేసీఆర్ మ‌రికాసేప‌ట్లో ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం వెల‌మ ఫంక్ష‌న్ హాల్ స‌మీపంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.