IPL Auction 2025 Live

No Lockdown in TS: లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదు, అన్ని యధాతథంగానే జరుగుతాయి, కరోనాను నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.విద్యా సంస్థలను తాత్కాలికంగానే మూసివేశామని అది కూడా కరోనా వ్యాప్తి పట్ల ముందు జాగ్రత్త చర్యగా చేపట్టామని అన్నారు.

Telangana CM KCR | File Photo

Hyderabad, Mar 27: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.విద్యా సంస్థలను తాత్కాలికంగానే మూసివేశామని అది కూడా కరోనా వ్యాప్తి పట్ల ముందు జాగ్రత్త చర్యగా చేపట్టామని అన్నారు. లాక్‌డౌన్‌ లాంటి చర్యలు చేపట్టమని (No Lockdown in TS) పరిశ్రమల మూసివేత ఉండదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబడదు. ఎవరూ బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. కరోనాను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నం..’ అని సీఎం కేసీఆర్‌ (Telangana CM K Chandrasekhar Rao) ప్రకటించారు.

మాస్కులు, భౌతిక దూరంతో కరోనా (TS Coronavirus) ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు. మూఢాలు ఉండి ప్రస్తుతానికి పెళ్లిళ్లు జరగడం లేదని, ఇతర ఫంక్షన్లలో కూడా గ్యాదరింగ్స్, సామూహిక ఊరేగింపు లు తగ్గించుకుంటే మంచిదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ 2021–22 సమావేశాల చివరిరోజు శుక్ర వారం ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ, శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి.

ఇటీవల సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నా వద్దకు వచ్చారు. లాక్‌డౌన్‌ పెడతారా? సినిమా హాళ్లు బంద్‌ చేస్తారా? అని అడిగారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నవారు ఉన్నారంటూ బాధలు చెప్పానన్నారు. నేను సభావేదికగా తెలంగాణ సమాజానికి ఈ విషయంలో స్పష్టంగా చెబుతున్నా. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ పెట్టేదిలేదు. పరిశ్రమలు మూసేదిలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేశాం. వ్యాక్సిన్‌ వేసే అంశమంతా కేంద్రం చేతిలో ఉంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేంద్రం వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేస్తోంది. ప్రధాని మోదీ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

తెలంగాణలో సినిమా థియేట‌ర్ల మూసివేత‌, ఖండించిన సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, థియేట‌ర్లు మూసివేస్తార‌న్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు అని సూచన

ఇదిలా ఉంటే గ్రేటర్‌లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. గత 20 రోజులుగా వరుసగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సిటీలో ఆరు ప్రాంతాల్లో కరోనా కేసులు భయపెట్టిస్తున్నాయి. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, హిమాయత్ నగర్, చింతల్ బస్తి, గోల్కొండ, ఆఘాపురా ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. హాస్టల్స్, రద్దీ గల ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నేటి నుంచి బల్దియా ప్రధాన కార్యాలయంలో సందర్శకుల ఎంట్రీకి అనుమతి నిరాకరించారు.



సంబంధిత వార్తలు

Harish Rao Serious On Government: గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ పాల‌న‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర ఆగ్ర‌హం

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్