Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, June 9:  రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు.

రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురండి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

కాగా, ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర అంశాలపై కేబినేట్ చర్చించనుంది.



సంబంధిత వార్తలు

Telangana Formation Day 2024 Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ ఫోటో గ్రీటింగ్స్, మెసేజెస్ మీకోసం

Telangana Formation Day Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

Revanth Reddy Slams KCR: కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, కేటీఆర్ మ‌తిలేని వ్యాఖ్య‌లు, ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు కేసీఆర్ రాక‌పోవ‌డంపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..