CM Revanth Reddy Delhi Tour: హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చ, ఆపిల్- ఫాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, పూర్తి వివరాలివే..

అనంతరం కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణ పనులు, మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల, సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

Telangana CM Revanth Reddy Delhi tour details, meetings with Congress leadership, Foxconn amid 'Operation Akarsh'

Delhi, Aug 16: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఆగస్టు 14న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణ పనులు, మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల, సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

అనంతరం ఆగస్టు 15న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. హస్తిన పర్యటనలో భాగంగా ఆపిల్, ఫ్యాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ,ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.

అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, నూతన పీసీసీ చీఫ్ వంటి అంశాలపై సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేతో చర్చించనున్నారు. అలాగే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియాగాంధీని, రుణమాఫీ హామీ పూర్తయిన నేపథ్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞత బహిరంగ సభకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న

దీంతో పాటు తిరిగి చేరికలపై దృష్టి సారించనున్నారు సీఎం రేవంత్. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తాజా టూర్‌లో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంపై క్లారిటీతోనే సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు సమాచారం. ఏదిఏమైన రేవంత్ హస్తిన టూర్ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు ఆశీస్తున్న వారు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి