Telangana: నారాయణపేట మర్డర్, పెద్దపల్లి అత్యాచార ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు, ఉట్కూరు ఎస్సై సస్పెండ్
నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన అమానుష ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. భౌతిక దాడులు, అరాచకాలు, హత్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Hyd, June 14: తెలంగాణలో రెండు చోట్ల జరిగిన అమానుష ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన అమానుష ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. భౌతిక దాడులు, అరాచకాలు, హత్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అమానుషంగా హత్య చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే రైతును కర్రలతో కొట్టి చంపిన ప్రత్యర్థి వర్గం, వీడియో ఎంత భయంకరంగా ఉందో చూడండి
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపైనా సీఎం సీరియస్ అయ్యారు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని... మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సంజీవ్‌ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూతగాదాలే ఈ హత్యకు కారణం.
Here's DGP Tweet
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
ఉట్కూరు ఎస్సై సస్పెన్షన్: ఉట్కూరు ఎస్సైని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఐజీ సుధీర్ బాబు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణమే స్పందించకపోవడంతో సస్పెండ్ చేశారు. ఎస్సై నిర్లక్ష్యం వల్లనే ఒకరు మృతి చెందారని గ్రామస్థులు ఆరోపించారు.