CM Revanth Reddy: ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం

హైదరాబాద్ రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సొసైటీకి అందజేశారు సీఎం.

Telangana CM Revanth Reddy speech at Ravindra Bharathi

Hyd, Sep 8: ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సొసైటీకి అందజేశారు సీఎం.

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అన్నారు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని..వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు....అది మనకు మనమే పెంచుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని....వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం అన్నారు.

జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే..ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి అన్నారు. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు ఏర్పడ్డాయి...కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు...అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది అన్నారు.

భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి...ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు అన్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు...నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నాను అన్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, ఎమ్మెల్యే - ఎంపీ కావాలంటే కోట్లు ఖర్చుపెట్టాల్సిందే, వీడియో వైరల్

వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం...మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నాను అన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు..అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం అన్నారు.ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములవుదాం అన్నారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif