Revanth Reddy On Cyber Crimes: పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి

పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana CM Revanth says World is facing biggest threat of cybercrimes(CMO X).jpg

Hyd, Oct 20:  కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

రాజాబహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ వేడుకలో పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

పోలీసు శాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి పొందిన టీమ్‌కు రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ3 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1.5 లక్షల నగదు అవార్డును ప్రకటించారు.

క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలంగాణ పోలీసు శాఖకు స్పూర్తినిచ్చే విధంగా డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ సందర్భంగా ఆ శాఖను అభినందించారు.

నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో కూడా తెలంగాణ పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. దేశంలోనే మిగతా పోలీసులకు ఆదర్శంగా నిలువాలని కోరారు.సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల రవాణా వంటి కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.  కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, తిరస్కరించిన బండి, గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి దీక్ష

పోలీసు కుటుంబాల కష్టం, నష్టాన్ని గమనించే అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తున్నాం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నందునే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలోకి గంజాయి లాంటి మత్తుపదార్థాలు సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 లో కాకినాడలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ తర్వాత తెలంగాణలో తొలిసారి డ్యూటీ మీట్ నిర్వహణకు అంగీకరించడంపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Harish Rao: విద్యా హక్కు చట్టం దుర్వినియోగం, సమగ్ర కుటుంబ సర్వే నుండి టీచర్స్‌ను మినహాయించండి..సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు డిమాండ్

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్