Hyderabad Rains: హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వాన, ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని పోలీస్ అధికారులు సూచన, రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Telangana Rain (Photo-Video Grab)

హైదరాబాద్‌ నగరాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఐటీ జోన్ లో ట్రాఫిక్ మరింత ఇబ్బందికరంగా ఉంది.

పంజాగుట్ట వద్ద భారీగా వరద, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు, వీడియో ఇదిగో..

హైదరాబాద్ లో మళ్లీ మరో రెండు గంటల పాటు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతారణశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కీలక సూచన చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. వీలైనంత వరకు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif