Praja Palana Cabinet Sub Committee: ప్రజాపాలన ఆరు గ్యారంటీలపై ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోం, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరిక, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క

తాజాగా ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని (Praja Palana Cabinet Sub Committee) ఏర్పాటు చేసింది

Mallu Bhatti Vikramarka (Photo-X)

Hyd, Jan 8: ప్రజా పాలన దరఖాస్తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. తాజాగా ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని (Praja Palana Cabinet Sub Committee) ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఈ సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు.

తెలంగాణ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా పాలన నోడల్‌ అధికారులు హాజరయ్యారు. డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీకి ఈ నెల చివరి వరకు సమయం కావాలని అధికారులు కోరారు.

నేటితో ముగిసిన ప్రజాపాలన ఆరు హామీల పథకం దరఖాస్తుల స్వీకరణ..45 రోజుల తర్వాత మరోసారి దరఖాస్తుల స్వీకరణ

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన-అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరిగిందని, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలనలో కోటి అయిదు లక్షల అభయహస్తం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇతర రేషన్ కార్డు, భూములు తదిరల అంశాల నుంచి 20 లక్షలు వచ్చాయన్నారు.

డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, అలాగే సబ్ కమిటీలో చర్చలు జరిపి విధివిధానాలు అర్హులను ప్రకటిస్తామన్నారు. అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందన్నారు.నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఈ నెల 25వ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ధరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ లింక్ చేస్తామని తెలిపారు. గ్యారెంటీలను ఇప్పటికిప్పుడే అమలు చేయాలని నిలదీయడం సరికాదని పొంగులేటి అభిప్రాయపడ్డారు. 40 రోజుల్లోనే అమలు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎవరెన్నీ విమర్శలు చేసినా, మేం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన మాట అమలు చేస్తామని తెలిపారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు