Hindu Ekta Yatra: తెలంగాణలో మసీదులు తవ్వుదాం, శవాలు ఉంటే మీవి, శివలింగాలు ఉంటే మావి, హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి (Dig up mosques in Telangana) చూద్దామని శవాలు ఉంటే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి సవాల్ చేశారు.

BJP-Chief-Bandi-Sanjay (Photo-Video Grab)

Karimnagar, May 26: కరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో(Hindu Ekta Yatra) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి (Dig up mosques in Telangana) చూద్దామని శవాలు ఉంటే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 'లవ్ జీహాద్'అంటూ లాఠీలు విరుగుతాయ్..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో రామరాజ్యాన్ని స్థాపించటమే మా లక్ష్యం అని అన్నారు. అంతేకాదు..తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఊర్డూ నిషేధించి మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామన్నారు బండి సంజయ్ (Telangana BJP president Bandi Sanjay Kumar). మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు. తెలంగాణలో రామరాజ్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని..రాక్షసుల రాజ్యం పోవాలని..అలా రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. మైనార్టీలకు కొమ్ముకాస్తూ హిందూ సమాజాన్ని హేళన చేస్తూ..హిందూ సమాజాన్ని చులకన చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని..అటువంటివారిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతాం అని బండి సంజయ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

ISB వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆసియాలో టాప్‌ బిజినెస్‌ స్కూల్‌గా ఐఎస్‌బీ ఎదిగిందని కితాబు

హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అన్నారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నామని తన సవాల్ కు వారు సిద్ధంగా ఉంటే తాము ఎప్పుడూ సిద్ధమేనని బండి సంజయ్ స్పష్టంచేశారు. ఇకపై లవ్ జిహాదీ పేరుతో అక్కా చెళ్లెళ్లను ట్రాప్ చేస్తే ఊరుకోమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ . లవ్ జిహాదీ అన్నోడికి లాఠీ రుచి చూపిస్తామన్నారు.పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మత మార్పిళ్లు చేస్తే మక్కెలిరగదీస్తామన్నారు. కాగా..కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.



సంబంధిత వార్తలు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్