Doctor Commits Suicide: జూబ్లీహిల్‌లో తుఫాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వియ్యంకుడిగా గుర్తించిన పోలీసులు, కుటుంబ కలహాలే కారణమని వార్తలు

అక్బరుద్దీన్‌ ఓవైసీ, డీసీపీ జోయల్ డెవీస్ ఆసుపత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు

Doctor Commits Suicide (Photo-ANI)

Hyd, Feb 27: హైద‌రాబాద్ నగ‌రంలోని జూబ్లీహిల్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్‌ నెం. 7లో నివాసం ఉంటున్న మాజారుద్దీన్ అనే వైద్యుడు తుఫాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం (Doctor Commits Suicide) చేశారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలైన వైద్యుడిని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు (Apollo Jubilee Hills) తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు, కడసారి వీడ్కోలు పలికేసిందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, నేతలు, నిందితుడిని ఉరితీయాలని ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్

కాగా మృతిచెందిన డాక్టర్‌ మజారుద్దీన్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వియ్యంకుడిగా (MLA Akbaruddin Relative) తెలుస్తోంది. అక్బరుద్దీన్‌ ఓవైసీ, డీసీపీ జోయల్ డెవీస్ ఆసుపత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మెడికో ప్రీతి మృతి కేసులో కొత్త ట్విస్ట్, హత్యా? ఆత్మహత్యా అనేది తేల్చాలని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన ఓయూ జేఏసీ, హత్య చేశారంటూ తండ్రి నరేందర్ ఆరోపణలు

మజార్‌ ఇంట్లో క్లూస్‌ టీం తనిఖీలు చేపట్టింది. ఆత్మహత్యపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే విచారణ తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశం ఉంది.మజారుద్దీన్ ఆత్మహత్యకు సంబంధించి కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మజారుద్దీన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.