Khammam Suicide Case: ఆర్థిక సమస్యలతో మాజీ సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ భార్య,భర్తలు మృతి, విషమంగా పిల్లల పరిస్థితి, మరో చోట ఇంటికి వస్తున్నానంటూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి విధితమే.

Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, Feb 8: ఖమ్మంలో రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఆత్మహత్యా యత్నానికి (Khammam Suicide Case) పాల్పడిన భార్య,భర్తలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి విధితమే.

గత శనివారం.. భార్య, భర్తలు వడ్య బాబురావు, రంగమ్మ పురుగులు మందు తాగి, ఇద్దరు పిల్లలకు కూడా కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చారు. దీంతో వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం భార్య,భర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు హనిస్వి, మహని పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన నవకాంత్ అమ్మా నేను ఇంటికొస్తున్నా.. బాధపడకు.. హైదరాబాద్‌లో దోస్తుల వద్దకు వెళ్లా.. ఈ రోజు వస్తున్నా’ అని తల్లికి ఫోన్‌ చేసి చెప్పిన కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు విగతజీవిగా మారిన విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

డబ్బులు కావాలంటూ బ్యాంకుకు వచ్చిన శవం, బిత్తరపోయిన కెనరా బ్యాంక్ అధికారులు, తన సొంత డబ్బులు ఇచ్చి దహన సంస్కారాలు చేయించిన బ్యాంకు మేనేజర్, అసలు కథ ఏంటంటే..

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన శ్రీరాం రవిశేఖర్, జ్యోతి దంపతుల కుమారుడు నవకాంత్‌.. ఈ నెల 3న ఇంట్లో ఎవరికీ చెప్ప కుండా వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఎంత వెతికి నా అతని ఆచూకీ దొరకలేదు.

ఈ క్రమంలో 5 రో జుల తర్వాత ఆదివారం అతను తల్లికి ఫోన్‌ చేశాడు. ఇంటికి వస్తున్నా ఏం ఆందోళన చెందొద్దంటూ చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాయంత్రానికే అతను కామారెడ్డి శివారులోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో దొరికిన ఆధార్‌ కార్డ్‌ ఆధారంగా రైల్వే పోలీసులు నవకాంత్‌ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.