Telangana Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడు, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా నయా స్కెచ్
20 మంది కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సైగ చేస్తే చాలని అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు (BRS MP Candidates) , ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
Hyd, April 18: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సైగ చేస్తే చాలని అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు (BRS MP Candidates) , ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించారు. 17మంది లోక్‌సభ అభ్యర్థులు, కంటోన్మెంట్ అభ్యర్థి నివేదితకు బీఫామ్‌లు అందజేశారు.
ఎన్నికల ఖర్చుల కోసం ఒక్కో ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కులను గులాబీ బాస్ అందజేశారు. ఈ సందర్భంగా సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గుడని మండిపడ్డారు. మనకు గతంలో 111మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని అన్నారు.
అప్పుడు మన ఎమ్మెల్యేలను కొనాలని చూసిన వాళ్లను దొరక బట్టామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చకుండా ఉంచుతాడా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తాను అనుకోనని కీలక వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ రేవంత్ బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జూలై 24కి వాయిదా, వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం
కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. రానున్న రోజులు మనవే. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీమ్ వర్క్ లేదు.. స్థిరత్వం లేదు. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. కవితపై ఎలాంటి కేసూ లేదు.. అయినా.. కక్ష కట్టి అరెస్టు చేశారు. బీజేపీ సీనియర్‌నేత బీఎల్ సంతోష్‌కు నోటీసులు పంపాం. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారు. అందుకే మనపై కక్ష పెంచుకున్నారు. ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య తలెత్తింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో మిల్లర్లు లేరు. అన్నింటా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట అధికారులు వినడం లేదు. కాంగ్రెస్‌ను నమ్మడం లేదని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు’’ అని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేద్దామని క్యాడర్‌కు తెలిపారు. ఎక్కడెక్కడ బస్సుయాత్ర చేయాలో నియోజకవర్గాల వారిగా రూట్‌మ్యాప్ ఇవ్వాలని సూచించారు. అవసరమైతే తాను వచ్చి జిల్లాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.సిద్దిపేట, మహబూబ్‌నగర్ లాంటి చోట భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిద్దామని కేసీఆర్ సూచించారు.ఉదయం రైతుల వద్దకు వెళ్లి పరామర్శించి వారికి ధైర్యం చెబుదామని చెప్పారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని కేసీఆర్ పేర్కొన్నారు.