Telangana Elections 2024: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌, రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్, ఆ 48 గంటలను డ్రై డేగా ప్రకటించిన ప్రభుత్వం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డేగా ప్రకటించింది. మే 11వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 48 గంటల డ్రై డేగా ప్రకటించింది.

Wine Shops (photo-X)

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డేగా ప్రకటించింది. మే 11వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 48 గంటల డ్రై డేగా ప్రకటించింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవు.  తెలంగాణలో RR ట్యాక్స్ వెయ్యి కోట్లు దాటేసింది, వేములవాడలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందని వెల్లడి

లోక్‌స‌భ ఎన్నికలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా చూసేందుకు రెండు రోజుల పాటు డ్రై డ్రేగా ప్ర‌క‌టించింది. అందులో భాగంగా మ‌ద్యం విక్ర‌యాల‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.మే 11న అంటే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వైన్ షాపుల‌తో పాటు క‌ల్లు కాంపౌండ్‌లు కూడా మూత ప‌డ‌నున్నాయి.

పండుగ‌లు, ప‌ర్వ‌దినాలు, ఎన్నికల కౌంటింగ్, పోలింగ్ జరిగినప్పుడు రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.