Good News for PSU Employees: తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 5 శాతం ఐఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ఐఆర్ పెంచుతూ సర్కారు జీవో జారీ చేసింది.

Telangana is the ideal state for India says CM Revanth Reddy(CMO X)

Hyderabad, Nov 30: తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు (Good News for PSU Employees) (పీఎస్ యూ ఉద్యోగులకు) రాష్ట్ర ప్రభుత్వం (State Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ఐఆర్ పెంచుతూ సర్కారు జీవో జారీ చేసింది. మూల వేతనం (బేసిక్ పే)పై 5 శాతం ఐఆర్ పెంచుతున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం గతేడాది అక్టోబరులో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఐఆర్ పెంచింది. తమకు కూడా పెంచాలన్న వివిధ వర్గాల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్ సర్కారు... ఆ మేరకు జీవో జారీ చేసింది.

గురుకుల సిబ్బందిపై కోమటిరెడ్డి ఆగ్రహం..నాసిరకం వంటకాలు, భోజనంలో నాణ్యత లేదని అధికారులపై ఫైర్..

ఎవరికి లబ్ధి?

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, యూనివర్సిటీల నాన్ టీచింగ్ స్టాఫ్, సహకార సొసైటీల ఉద్యోగులు, ఆయా సంస్థల పెన్షనర్లు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా మధ్యంతర భృతి అందుకోనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి విగ్రహంతో మాజీ హోంగార్డు దీక్ష, హోంగార్డు వ్యవస్థను పర్మినెంట్ చేయాలని డిమాండ్..వీడియో ఇదిగో



సంబంధిత వార్తలు