Telangana Crop Loan Waiver Update: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ముందుగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ, డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ
ఈ సమావేశంలో రైతు రుణమాఫీ (Telangana Crop Loan Waiver Update)కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM A Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyd, July 18: ప్రజాభవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ (Telangana Crop Loan Waiver Update)కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM A Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలలోగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. రేపు సాయంత్రం లోగా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.
ఈ నెలాఖరులోగా రెండో దఫాలో లక్షన్నర రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్ట్ నెలలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 7 నెలల్లోనే సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఏకమొత్తంలో వీటిని మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓ వైపు పాలన మరో వైపు పార్టీ..కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ కీలక సమావేశం
ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ రూ.28వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం...కేసీఆర్ స్పందించాలని అసద్ డిమాండ్
రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి. ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదు.
రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలి. గురువారం గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలి. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసింది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.