Justice Narasimha Reddy Commission Row: విద్యుత్‌ కమిషన్‌ విచారణ రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చంటూ స్పష్టం

విద్యుత్‌ కమిషన్‌ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే

KCR and Telangana High Court (Photo-FB and Wikimedia Commons)

Hyd, July 1: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన రిట్‌ పిటిషన్‌ను (Former CM KCR’s writ petition) తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది.

మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వొకేట్ జనరల్(ఏజీ) తెలిపారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ వాదనలతోనే ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. కేసీఆర్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సోమవారం ఉదయం వెల్లడించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది.  జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్‌ రిట్ పిటిషన్, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు

కాగా బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌, జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ (Justice Narasimha Reddy commission) వేసింది. ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో.. ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయగా, దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి.

విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. అయితే.. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో జెన్‌కో అధికారుల్ని సైతం విచారించిందని,ఈ పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో ఏజీ వాదనలతో ఏకీభవించిన ప్రభుత్వం కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌ను కొట్టేసింది.



సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు