Telangana: అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ ఖరారు, తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16న తెలంగాణ రాజధానికి రానున్న కేంద్ర హోం మంత్రి
ఈ మేరకు షెడ్యూల్ (Home minister Amit Shah) ఖరారైంది. ఇటీవల మునుగోడు సభలో పాల్గొన్న ఆయన.. ఈ నెల 16న హైదరాబాద్‌కు (visit Hyderabad on 16th september )రానున్నారు
Hyd, Sep 15: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ (Home minister Amit Shah) ఖరారైంది. ఇటీవల మునుగోడు సభలో పాల్గొన్న ఆయన.. ఈ నెల 16న హైదరాబాద్‌కు (visit Hyderabad on 16th september )రానున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి విదితమే. బీజేపీ అగ్రనేత, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా 16న సాయంత్రం నగరానికి చేరుకుంటారు. 17న ఉదయం పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాల సైనిక వందనాన్ని స్వీకరిస్తారు.
ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధులు లేదా వారి కుటుంబసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం కూడా కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సేవా కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొంటారు. ఇందులో భాగంగా వికలాంగులు, ఇతర వర్గాలకు ఉపయోగపడే అంబులెన్స్‌ల అందజేత, దివ్యాంగులకు మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్ల పంపిణీ, వివిధ హాస్టళ్లవారికి మరుగుదొడ్లను శుభ్రం చేసే ప్రత్యేక పరికరాలు, యంత్రాలు (బోస్చ్)అందజేస్తారు.