Representative Image Murder ( Photo Credits : Pixabay

Hyd, May 27: తెలంగాణలో పరువు హత్యలు (Honour killing) తీవ్ర కలవరం రేపుతున్నాయి. వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న సరూర్‌నగర్‌, బేగంబజార్‌ ఘటన నుంచి తేరుకోకముందే ఆదిలాబాద్‌లో మరో ఘోరం జరిగింది. నార్నూర్‌ మండలం నాగల కొండలో ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురినే తల్లిదండ్రులు హత్య (Honour killing in Adilabad) చేశారు. రాజేశ్వరి అనే యువతి వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది.

అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లి నిరాకరించడంతో.. నెల కిత్రం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో తమ మాట కాదని వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పరువు తీసిందని కూతురిపై తల్లిదండ్రులు పగ ( marrying against their will) పెంచుకున్నారు. ఇటీవల దీనిపై పెద్ద సమక్షంలో పంచాయతీ జరిగింది. రాజేశ్వరిని, అలీంను విడదీస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. ఐతే తనకు భర్త కావాలంటూ రాజేశ్వరి బీష్మించింది.

పరువు పేరుతో ప్రేమికులు దారుణ హత్య, మృతురాలి అన్నకు ఉరిశిక్ష, 12 మందికి యావజ్జీవ కారాగార శిక్షవిధిస్తూ తీర్పు వెలువరించిన తమిళనాడు కడలూరు కోర్టు

తండ్రి దేవిదాస్‌తో గొడవకు దిగింది. ఘర్షణ తీవ్ర తరం కావడంతో కుటుంబ పరువు తీశావంటూ దేవిదాస్‌..ఆమెను నడి రోడ్డుపై కత్తితో దాడి ( parents kill daughter) చేశాడు. కూతురు గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో పరువు హత్య, మతాంతర వివాహం చేసుకున్న యువకుడిని దారుణంగా హతమార్చిన యువతి తరపు బంధువులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. తన కుమార్తెను ఎవరో చంపేశారంటూ ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు..ఘటనాస్థలిని పరిశీలించారు. కేసును తండ్రి దేవిదాస్‌ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఐతే పోలీసులు విచారణలో నిజాలు బయటపడ్డాయి. యువతి తండ్రే హత్య చేసినట్లు గుర్తించారు. తల్లి సావిత్రి బాయి ఎదుటే హత్య చేసినట్లు విచారణలో తేలింది. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగానే హత్య చేసినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

CM Revanth reddy Speech: ప‌దేళ్ల‌లో రాష్ట్ర సంప‌ద గుప్పెడు మందికి చేరింది, త‌ప్పులు జ‌రిగితే స‌రిదిద్దుకొని, అంద‌రినీ క‌లుపుకొని ముందుకు వెళ్తాం

Telangana Formation Day 2024 Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ ఫోటో గ్రీటింగ్స్, మెసేజెస్ మీకోసం

Telangana Formation Day Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

Revanth Reddy Slams KCR: కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, కేటీఆర్ మ‌తిలేని వ్యాఖ్య‌లు, ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు కేసీఆర్ రాక‌పోవ‌డంపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు

Telangana State Formation Day 2024 Telugu Wishes: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో శుభాకాంక్షలు తెలిజయేండిలా..

2024 భారతదేశం ఎన్నికలు: ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

Jaya Jayahe Telangana: జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ ఇవేనా ? తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా