Telangana Horror: సూర్యాపేటలో దారుణం, బ్లేడుతో భార్య, వదినలపై దాడి చేసి గొంతు కోసిన భర్త, కుటుంబ కలహాలే కారణమని తెలిపిన స్థానికులు

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవలో భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య నాగలక్ష్మి, వదిన స్వరూప గొంతును బ్లేడుతో కోసేశాడు. తీవ్ర గాయాలతో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు నాగార్జునను బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Husband slashed wife and his Brother wife throat in Kalvapalli village of Garidepally mandal of Suryapet district

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవలో భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య నాగలక్ష్మి, వదిన స్వరూప గొంతును బ్లేడుతో కోసేశాడు. తీవ్ర గాయాలతో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు నాగార్జునను బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన నాగయ్య రెండో కుమార్తె నాగలక్ష్మికి మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామానికి చెందిన యరకలపూడి నాగార్జున్‌కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా మూడేళ్లుగా నాగలక్ష్మి భర్తకు దూరంగా కాల్వపల్లిలో ఉంటోంది. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో 12 మందికి గాయాలు

నాగార్జున్‌ తన కుమారుడిని చూడడానికి అప్పడప్పుడు కాల్వపల్లి వస్తుండేవాడు. మంగళవారం మధ్యాహ్నం భార్య, కుమారుడిని చూసి వెళ్లడానికి వచ్చిన క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నాగలక్ష్మీ హుజూర్‌నగర్‌లోని ఓ ఫైనాన్స్‌లో పనిచేస్తుండగా, అక్కడికి వెళ్లాడు. అక్కడే ఆమెపై బ్లేడుతో దాడిచేసేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాలు ఉండడాన్ని గమనించి ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. సహనం కోల్పోయి భార్యను చంపుతానని నాగార్జున బ్లేడ్‌తో గొంతు కోయడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న నాగలక్ష్మీ అక్క స్వరూప అడ్డురాగా ఆమె గొంతు కూడా కోశాడు.

Here's Video

ఇది గమనించిన స్థానికులు 108కు ఫోన్‌ చేయగా అంబులెన్స్‌ రావడం ఆలస్యం కావడంతో స్వరూప భర్త తన భార్య స్వరూపను, నాగలక్ష్మీలను బైక్‌పై హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నిందితుడు నాగార్జున్‌ను పోలీసులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు.