Telangana: పాతబస్తీలో స్వలింగ సంపర్కం కేసు వెలుగులోకి, భార్య మృతితో మరో వ్యక్తితో స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన యువకుడు, బ్లాక్ మెయిల్ చేయడంతో ఆత్మహత్యాయత్నం

ఇద్దరు యువకుల మధ్య సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అనంతరం ఇద్దరిలో ఒకరు మరొకరిని డబ్బులు బ్లాక్ మెయిల్ చేయడంతో ఇంకో వ్యక్తి ఆత్మహత్యాయత్నం (hyderabad-gay-attempts-suicide) చేశాడు.

Representational Image | (Photo Credits: PTI)

Hyd, June 23: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకుల మధ్య సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అనంతరం ఇద్దరిలో ఒకరు మరొకరిని డబ్బులు బ్లాక్ మెయిల్ చేయడంతో ఇంకో వ్యక్తి ఆత్మహత్యాయత్నం (hyderabad-gay-attempts-suicide) చేశాడు. శాలిబండ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిబండకు చెందిన ఓ యువకుడి ​ భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్​లైన్​లో ​ ట్యూషన్​లు చెప్పేవాడు. ఈక్రమంలోనే 2018లో అతనికి మొఘల్​పురాకు చెందిన మరో యువకుడు​ పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలోనే శాలిబండ యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అనంతరం ఇద్దరు స్వలింగ సంపర్కానికి (Gay Partners) అలవాటు పడ్డారు.

సహోద్యోగి ఫ్యాంట్ విప్పి అతడి పురుషాంగం పట్టుకున్న పోలీస్ ఆఫీసర్, ఇంత చిన్నదా అంటూ అందరి ముందు ఎగతాళి, సీరియస్ అయిన పై అధికారులు, పోలీసు అధికారి సస్పెండ్

కొద్ది కాలానికి శాలిబండ యువకునికి మరో యువతితో రెండో పెళ్లి జరిగింది. అయితే వీరిద్దరి సంబంధాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ వీరిద్దరు ప్రేమలో మునిగిపోయి సహజీవనం సాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్​పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగింది. ఆ సమయంలో శాలిబండకు చెందిన యువకుడు ​10 లక్షల ఆర్థిక సహాయం కూడా అతనికి చేశాడు. అయితే మొఘల్​పురా వాసి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తనతో కలిసి ఉన్న సమయంలో సీక్రెట్​గా తీసిన వీడియోలను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తానని తర్వాత బెదిరిపులకు (partner-harassment) గురిచేశాడు.

కరోనా ఎఫెక్ట్, పురుషాంగం సైజు భారీగా తగ్గిందట, లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్న ఓ వ్యక్తి, అంగస్తంభన సమస్య కూడా వస్తుందని నిపుణులు వెల్లడి

ఈ విషయంపై అప్పట్లో మొఘల్​పురా పోలీస్​స్టేషన్​లో కేసు కూడా నమోదయ్యింది. ఆ తర్వాత కూడా మొఘల్ పురా వ్యక్తి దగ్గరికి రానివ్వకపోగా...అతని నుంచి ​ రోజు రోజుకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండ యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతనే 100 కంట్రోల్​ రూమ్​, 108 ఆంబులెన్స్​కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.