Hyderabad Metro Trains:మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు, సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరిన మెట్రో రైలు ఎండీ

ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా.. దానిని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు.

Metro (File: Google)

Hyd, Jan 2: భాగ్య నగరంలోని నాంపల్లిలో ఆదివారం నుంచి ప్రారంభమైన నుమాయిష్ (numaish) సందర్శకుల కోసం మెట్రో సర్వీసులను (Hyderabad Metro Trains) అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా.. దానిని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సూచించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు.. అంటే ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగుతుందని ఆయన వివరించారు.

అయ్యప్ప స్వామిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, కొనసాగుతున్న అరెస్టుల పరంపర

మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్లను 6కు పెంచినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులను నడిపించినట్లు తెలిపారు. మెట్రో రైళ్లలో మద్యం సేవించకూడదని, మెట్రో సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని ప్రయాణికులకు మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.