Hyderabad: నుదుటిన ఎర్రటి బొట్లు..హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం అత్మహత్య, విషాద ఘటనపై అనేక అనుమానాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త, టీచర్ గా పనిచేస్తున్న భార్య ఇద్దరూ ఆత్మహత్య ( Hyderabad Software engineer ends life) చేసుకున్నారు. వారితో పాటు వారి చిన్నారి కూతురుని కూడా వారితో తీసుకువెళ్లారు.

Representational Image (Photo Credits: ANI)

Hyd, Jan 21: హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త, టీచర్ గా పనిచేస్తున్న భార్య ఇద్దరూ ఆత్మహత్య ( Hyderabad Software engineer ends life) చేసుకున్నారు. వారితో పాటు వారి చిన్నారి కూతురుని కూడా వారితో తీసుకువెళ్లారు. అయితే వీరి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండడం, దేవుడి గదిలో చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషాద సంఘటన (Software Family Suicide) సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగుచూసింది.

సీఐ శ్రీనివాసులురెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా (Hyderabad Software) పనిచేసే శ్రీకాంత్‌గౌడ్‌ (42), తన భార్య అనామిక (40) కుమార్తె శ్రీస్నిగ్ధతో కలిసి అమీన్‌పూర్‌ వందనపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్‌ది మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండలం పోతాయపల్లి కాగా అనామిక కుటుంబం అల్వాల్‌లో ఉండేది. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015 నుంచి వందనపురి కాలనీలో ఉంటున్నారు.

అనామిక స్థానికంగా ఉన్న ప్రాచీన్‌ గ్లోబల్‌ కార్పొరేట్‌ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. స్నిగ్ధ రెండో తరగతి చదువుతోంది. రెండురోజులుగా ఒకరి ఫోను స్విచ్ఛాప్‌ రావడం, మరొకరి ఫోను మోగుతున్నా ఎత్తకపోవడంతో అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి వందనపురిలోని వారింటికి వచ్చారు. తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో అనుమానంతో అమీన్‌పూర్‌ పోలీసులకు, ఇతర కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

మంత్రాలు చేస్తున్నారంటూ..తండ్రి, ఇద్దరు కొడుకులను కిరాతకంగా చంపిన ప్రత్యర్థులు, జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. అనామిక, శ్రీస్నిగ్ధ నోట్లో నురగలతో విగతజీవులుగా పడి ఉన్నారు. పక్క గదిలో శ్రీకాంత్‌గౌడ్‌ ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. విగతజీవులుగా ఉన్న ముగ్గుర్నీ చూసి కుటుంబసభ్యులు పెద్దపెట్టున రోదించారు. శ్రీకాంత్, అనామికలు బాగానే ఉండేవారని, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవని శ్రీరామచంద్రమూర్తి విలపించారు. క్లూస్‌ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పోలీసులు దంపతులిద్దరి ఫోన్‌లను, శ్రీకాంత్‌గౌడ్‌ ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌గౌడ్‌ ఫోన్‌కు లాక్‌ ఉందని సీఐ తెలిపారు.

పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్‌ దంపతులకు చెందిన ఒక ఫోన్‌ ఫార్మాట్‌ చేసి ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఈ ఫార్మాట్‌ అయిన సెల్‌ఫోన్‌ కూడా ఉంది. ఈ సెల్‌ఫోన్‌ను ఎందుకు ఫార్మాట్‌ చేశారు.. అందులోని డేటాను ఎందుకు తొలగించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన డేటాను రికవరీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ దంపతులకు ఆర్థిక ఇబ్బందులేమైనా ఉన్నాయా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

వీరి బ్యాంకు అకౌంట్‌ వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. వీరికి సుమారు రూ.30 లక్షల వరకు అప్పులు ఉన్నాయనే ప్రాథమిక సమాచారం పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. కానీ వారు నివసిస్తున్న ఇల్లే రూ.కోటికి పైగా విలువ చేసేది కావడంతో పాటు, వీరికి పొలాలు ఇతర స్థిరాస్తులు కూడా ఉన్నట్టు తెలియడంతో ఈ అప్పులేవీ ఆత్మహత్యలకు కారణం కాకపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇంట్లో సూసైడ్‌ లెటర్‌లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. పని మనిషిని రెండురోజుల ముందే రావద్దని చెప్పినట్లు తెలిసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ పీఠం బీజేపీదేనంటున్న ఎగ్జిట్ పోల్స్, ఊహించని షాక్ ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న సర్వేలు

Delhi Assembly Elections 2025: ఢిల్లీలొ ముగిసిన ఎన్నికల పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదు, ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల

KP Chowdary Dies by Suicide: ఆర్థిక ఇబ్బందులా లేక డ్రగ్స్‌ కేసులో నిందితుడనే అవమానమా, ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య, గోవాలో ఇంట్లో విగతజీవిగా కనిపించిన సుంకర కృష్ణప్రసాద్‌ చౌదరి

Harishrao: కాంగ్రెస్ పాలనలో రైతులు,ఆటో డ్రైవర్లే కాదు.. బిల్డర్లు ఆత్మహత్య, ప్రభుత్వ అసమర్థ విధానాలే ఆత్మహత్యలకు కారణమని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్

Share Now