Telangana: వారం వ్యవధిలో రెండో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య, లాడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ విద్యార్థి, 2019 నుంచి ఆరుగురు విద్యార్థులు సూసైడ్

తాజాగా ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు (IIT-Hyderabad student commits suicide) పాల్పడ్డాడు. సంగారెడ్డిలోని ఒక లాడ్జ్ పై నుంచి విద్యార్థి (IT-Hyderabad student) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Representational Image (Photo Credits: File Image)

Hyd, Sep 7: ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు (IIT-Hyderabad student commits suicide) పాల్పడ్డాడు. సంగారెడ్డిలోని ఒక లాడ్జ్ పై నుంచి విద్యార్థి (IT-Hyderabad student) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ నగరానికి చెందిన మేఘా కపూర్ గా గుర్తించారు. మూడు నెలల క్రితమే ఐఐటీలో మేఘా కపూర్ బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

బీటెక్ పూర్తయినప్పటి నుంచి సంగారెడ్డిలోని ఆధ్యా లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మేఘా కపూర్ మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.వారం వ్యవధిలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండో సారి.

మందులోకి బిర్యానీ వండలేదని భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపిన భర్త, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

ఆగస్ట్ 31న ఐఐటీలో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో నైలాన్ తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఐఐటీలో 2019 నుంచి ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. మరోవైపు, ఐఐటీ క్యాంపస్ లో వరుస ఆత్మహత్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.



సంబంధిత వార్తలు