Balanagar Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్, హైదరాబాద్‌లో బాలానగర్ ప్లై ఓవర్ ప్రారంభం, మున్సిపల్ కార్మికురాలితో రిబ్జన్ కటింగ్ చేయించిన మంత్రి కేటీఆర్, బాలానగర్ ఫ్లైఓవర్ ఇకపై జగ్జీవన్‌రామ్ వంతెనగా పేరు మార్పు
ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. భాగ్యనగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు బాలానగర్ ప్లై ఓవర్ (Balanagar Flyover) అందుబాటులోకి తీసుకువచ్చారు.
Hyderabad, july 6: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. భాగ్యనగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు బాలానగర్ ప్లై ఓవర్ (Balanagar Flyover) అందుబాటులోకి తీసుకువచ్చారు. బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. బాలానగర్ బిడ్జి రిబ్బెన్ కటింగ్ మున్సిపల్ కార్మికురాలితో మంత్రి కేటీ రామారావు (Telangana, IT Minister KTR) చేయించారు
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ కష్టాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు పురపాలక శాఖ అన్నారు. నగరంలో తొలిసారి ఆరు వరుసలతో నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. సుమారు రూ.385 కోట్ల వ్యయంతో మూడన్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2017 ఆగస్టు 21న కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. 1.13 కిలోమీటర్ల పొడవు.. 24 మీటర్ల వెడల్పుతో.. 26 పిల్లర్లతో ఈ వంతెన నిర్మించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Here's KTR Tweet
బాలానగర్ ఫ్లైఓవర్‌కు జగ్జీవన్‌రామ్ వంతెనగా పేరు నిర్ణయిస్తున్నాం. దుర్భరమైన ట్రాఫిక్ కష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటి. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నగరంలో ఇప్పటికే వంతెనలు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఫ్లైఓవర్లు కూడా త్వరగా పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రెండు స్కైవేలు సాధ్యం కావడం లేదు. వంతెనల కోసం అవసరమైన భూములను కేంద్రం ఇవ్వటం లేదు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవేలు నిర్మిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.
నగరంలో రోజు రోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2050 వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ బ్రిడ్జిని నిర్మించినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న నాలుగు రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.