Rajanna Sircilla, July 4: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో (CM KCR Rajanna Sircilla Tour) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌ను కేసీఆర్ (KCR) ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తన ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరన్నారు. లక్ష్యంగా దిశగా వెళ్తున్నాం.. ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి ఇచ్చామని, రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. వలస వెళ్లినవారు తిరిగి ఊళ్లకు వస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మిషన్ కాకతీయ కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. తెలంగాణలో నీళ్ల కోసం 500-600 మీటర్లు లిఫ్ట్ చేయాలని ప్రధాని అంటే.. నేను తీవ్రంగా వ్యతిరేకించానని సీఎం (CM KCR Rajanna Sircilla Tour Updates) తెలిపారు.
తెలంగాణలో 50 మీటర్లు లిఫ్ట్ చేస్తే నీళ్లు వస్తాయని ప్రధానికి చెప్పా. కాళేశ్వరం పూర్తవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కళ్లముందు కనిపిస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రసారం చేశారని’’ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రస్తావించారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ (Mission Kakatiya) రూపకల్పన జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఇక్కడ గేటెడ్ కమ్యునిటి తరహాలో రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. ఈ సందర్భంగా కేసీఆర్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రీసెర్చ్ కేంద్రంతో పాటు మండేపల్లిలో నిర్మించిన ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. 20 ఎకరాల స్థలంలో రూ.16.48 కోట్లతో ఈ ఐడీటీఆర్‌ను నిర్మించారు. ఈ కేంద్రంలో నెలకు 400 మందికి పైగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
Here's CM KCR Rajanna Sircilla Tour Video
Live: CM Sri KCR speech at the Inaugural ceremony of Integrated District Officers Complex in Rajanna Sircilla https://t.co/SxldwsniRJ
— Telangana CMO (@TelanganaCMO) July 4, 2021
Live: CM Sri KCR inaugurating Telangana Institute of Driving Education and Skills in Rajanna Sircilla Dist https://t.co/mym6l73jTX
— Telangana CMO (@TelanganaCMO) July 4, 2021
Live: CM Sri KCR inaugurating 2 BHK Dignity Houses at Mandepalli Village in Rajanna Sircilla Dist https://t.co/S4vzCKG12U
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 4, 2021
పర్యటనలో భాగంగా సీఎం సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. రూ.36.45 కోట్లతో 5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో నర్సింగ్ కళాశాల, వసతి గృహాలను నిర్మించారు. దీంతో పాటు సిరిసిల్ల మార్కెట్ కమిటీ సముదాయం, గిడ్డంగులను కేసీఆర్ ప్రారంభించారు. సర్దాపూర్ మార్కెట్ యార్డుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ రైతుల కోసం సకల వసతులతో మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. రూ.20 కోట్లతో 20 ఎకరాల్లో యార్డును నిర్మించారు. అనంతరం సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సకల సౌకర్యాలతో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు.
పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే.. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ అడిగిన చెక్‌డ్యామ్‌లను మంజూరు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఒక లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నామని.. ఫలితాలు కనిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం రాసులు కనబడుతున్నాయని కేసీఆర్ వెల్లడించారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారితో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రూ.10 వేల కోట్లతో వైద్య వ్యవస్థను పెంచాలని నిర్ణయించామని కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల నిర్మాణమని కేసీఆర్ అన్నారు. జిల్లాకు త్వరలో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని కేసీఆర్ చెప్పారు.
నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నామని, తొలి ఏడాది విద్యార్థులకు రూ.5 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది విద్యార్థులకు రూ.7 వేల స్టైఫండ్ పెంచామని కేసీఆర్ చెప్పారు. వేములవాడ ఆలయాన్ని అద్భుత కళాఖండగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ అన్నారు. వలసలు వెళ్లిన తెలంగాణ ప్రజలు తిరిగొస్తున్నారని, కరీంనగర్ జిల్లాను అమృతవర్షిణిగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు. ఎవరు ఏం చేసినా కేసీఆర్ ప్రయాణాన్ని ఆపలేరని సీఎం కేసీఆర్ వెల్లడించారు.