Land Dispute in Achampet: భూవివాదం, ఫారెస్ట్ అధికారిపై పెట్రోలు పోసి నిప్పంటించబోయిన చెంచు మహిళ, ఈ వివాదాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
Image used for representational purpose only. | File photo

Achampet, July 3: తెలంగాణ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పోడు భూముల వివాదం (Land Dispute in Achampet) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ అధికారులు గిరిజనుల మధ్య సాగిన భూ వివాదంలో అటవీ శాఖ అధికారిపై చెంచు మహిళ (achampet Chenchu tribal woman) పెట్రోల్‌ పోసి, తానూ పోసుకుని నిప్పంటించేందుకు (pours petrol on forest official) యత్నించగా అక్కడున్నవారు అడ్డుకోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు.

ఘటన వివరాల్లోకెళితే..నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారానికి చెందిన 20 మంది చెంచులు 30 ఏళ్లుగా సమీపంలోని 60 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. నెల క్రితం ఆ భూములు సాగు చేయొద్దని చెంచులకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా తిరస్కరించారు. తాజాగా శుక్రవారం ప్లాంటేషన్‌ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ఆ భూముల్లో మార్కింగ్‌ వేయడానికి వచ్చారు. దీంతో చెంచు మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు.

రైతుల ఘోష వినలేదనే కోపంతో శివంపేట్ తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతు, తరువాత తనపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం, పక్కనే ఉన్న రైతులు అలర్ట్ కావడంతో తప్పిన ప్రాణాపాయం

భూముల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని తెగేసి చెప్పారు. అంతలోనే ఓ మహిళ అటవీశాఖ అధికారిపై పెట్రోల్‌ చల్లి తానూ పోసుకుని అగ్గిపుల్ల గీసేందుకు యత్నించింది. వెంటనే కొందరు లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇది తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడి వెళ్లి మాట్లాడారు. పోడు భూముల విషయాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని, చెంచులను ఇబ్బంది పెట్టవద్దని 15 రోజుల క్రితమే అధికారులకు చెప్పామని పేర్కొన్నారు.

కాగా అటవీ హక్కుల గుర్తింపు (రోఎఫ్‌ఆర్) పట్టాలు లేకుండా ఈ భూములను స్వాధీనం చేసుకున్న చెంచు కుటుంబాలు ఆగ్రహానికి గురై అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.. ఈ ఆగ్రహంతోనే చెంచు మహిళ బీట్ ఆఫీసర్ పై పెట్రోల్ పోసిందని సమాచారం. అయితే గ్రామంలోని అటవీ అధికారులు మరియు చెంచులు గొడవపడటం ఇదే మొదటిసారి కాదు. చెంచూ సేవా సంఘం అధ్యక్షుడు నాగయ్య చెప్పిన వివరాల ప్రకారం, గత నెలలో కూడా చెంచులు-అటవీ అధికారుల మధ్య వివాదం ఉంది.

సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌..రాబోయే నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు, అవసరమైతే మరో రూ. 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధం, సీఎం దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్

అధికారులు తమ భూములను కొంతవరకు వదిలేయాలని చెంచులను ఒప్పించటానికి ప్రయత్నించారు మిగిలిన వారికి పట్టాలు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. అయితే, ఈ చర్చలు విఫలమయ్యాయి ”అని నాగయ్య ఓ పత్రికకు తెలిపారు. ఇంతలో, అటవీ అధికారులు 2005 తరువాత ఆ భూములను ఆక్రమించినందున చెంచులకు రోఎఫ్ఆర్ పట్టాలు లేవని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన చెంచులపై చర్యలు తీసుకుంటామని అమరాబాద్ రేంజ్ ఆఫీసర్ అర్చన మీడియాకు తెలియజేశారు.