Kamareddy DSP Arrested: తెలంగాణలో బెట్టింగ్ కేసు మళ్లీ తెరమీదకు, ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు, కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

అయితే ఇప్పుడు ఈ వార్త మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్‌ (Kamareddy DSP Arrested) చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Telangana Kamareddy DSP T Lakshminaryana (Photo-ANI)

Hyderabad, Dec 7: తెలంగాణలో గతంలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ వార్త మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్‌ (Kamareddy DSP Arrested) చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

కాగా క్రికెట్ బెట్టింగ్‌ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్‌, ఎస్సై గోవింద్‌ గతంలో డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని (Kamareddy DSP T Lakshminaryana arrested) కూడా విచారించారు. అయితే ఈ బెట్టింగ్‌ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిచించారు.

గత నెలలో ఐపీఎల్‌ బెట్టింగ్ (IPL Betting) వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను కుదిపేసింది. క్రికెట్ బెట్టింగ్‌ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన కామారెడ్డి సీఐ జగదీశ్‌ను ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న పోలీసుల వివరాలను ఏసీబీ సేకరించింది.

రూ. 16 కోట్ల‌ ఐపీఎల్ బెట్టింగ్, హైద‌రాబాద్ న‌గ‌రంలో ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, క్రికెట్‌ మజా11 మొబైల్‌ యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌

బాన్సువాడ కు చెందిన సుధాకర్‌ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్‌ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నవంబర్ నెల 6న అతనికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్‌ రూ. 5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్‌ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్‌ ఒత్తిడి పెంచ డంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అదే నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్‌తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్‌పై కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్‌ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్‌ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ అప్పట్లో తెలిపారు. మధ్యవర్తి సుజయ్‌ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడతామని కూడా చెప్పారు.

ఇదిలా ఉంటే బెట్టింగ్‌ కేసులో అవినీతి ఆరోపణలతో మరో పోలీస్‌ అధికారి, కామారెడ్డి పట్టణ ఎస్‌ఐ గోవింద్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. సీఐకి చెందిన లాకర్‌ నుంచి 34 లక్షల నగదు, తొమ్మిది లక్షల విలువైన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.