ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సిటీ పోలీసులు అరెస్టు (IPL betting Racket Busted in Hyd) చేశారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ. 16 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ కేంద్రంగా ఈ ముఠా బెట్టింగ్ దందా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేష్, సురేశ్, పంకజ్, సత్తయ్యతో పాటు మరో ముగ్గురు అరెస్టు (Police Arrested Cricket Betting Gangs) చేశారు.
అన్ని రాష్ర్టాల్లో ముఠాలను ఏర్పాటు చేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు (Hyderabad Police) నిర్ధారించారు. ఈ ముఠా నిర్వాహకుడు గణేష్ గా పోలీసులు నిర్ధారించారు. ముఠాకు చెందిన సభ్యుల నుంచి 16 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలోనే ఈ ముఠా సభ్యులు క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకా రం... కార్వాన్‌లోని బంజావాడికి చెందిన వినయ్ సింగ్‌కు బాగ్‌లింగంపల్లిలో ఆర్యన్ కార్ వాషింగ్ పాయింట్ సెంటర్ ఉంది. అందులో అదే ప్రాంతానికి చెందిన ఆకాశ్‌సింగ్ పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు స్నేహితులు. చేసే పనిలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో.. ఏడాది కాలంగా క్రికెట్ మజా11 మొబైల్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
శనివారం రాత్రి కార్వాన్‌లోని తన ఇంట్లో ఆకాశ్ సింగ్ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు బృందం ఆ ఇంటిపై దాడి చేసి.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.2 లక్షల నగదు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను కుల్సుంపురా పోలీసులకు అప్పగించారు.