Corona in TS: తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్స్, థర్ఢ్ వేవ్ తర్వాత భారీగా పెరిగిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 852 కొత్త కేసులు, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 358 మందికి కోవిడ్
గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,16,531కి పెరిగింది. ఇందులో 8,07,505 మంది బాధితులు కోలుకున్నారు.
Hyd, July 27: రాష్ట్రంలో థర్డ్‌వేవ్ తర్వాత కరోనా భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,16,531కి పెరిగింది. ఇందులో 8,07,505 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 36,764 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 4,915 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులతో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 358, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 63, రంగారెడ్డిలో 57, పెద్దపల్లిలో 35, మహబూబాబాద్‌లో 32, ఖమ్మంలో 28, హన్మకొండలో 26, నల్గొండలో 26, జనగామలో 26, కరీంనగర్‌లో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 22 కేసులు నమోదయ్యాయి.