Telangana Shocker: తాగొచ్చి భార్యను కొట్టాడు, అలిగి పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య చేసుకున్నాడు, నార్సింగి ప్లైఓవర్‌పై నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పైకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి
నార్సింగి ప్లైఓవర్‌పై నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు (Man commits suicide) పాల్పడ్డాడు
Hyd, July 21: భాగ్యనగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నార్సింగి ప్లైఓవర్‌పై నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు (Man commits suicide) పాల్పడ్డాడు. నారాయణపేట్ జిల్లా, మద్డూరు మండలం, చింతల్‌పేట్ గ్రామానికి చెందిన భీమప్ప(30) గత కొంత కాలంగా నార్సింగి మున్సిపల్ కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అతను స్థానిక ఫ్లై ఓవర్‌పై ( flyover in Narsingi ) నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపైకి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
పోలీసుల కథనం మేరకు.. మద్యం తాగొద్దని భార్య చెప్పడంతో...అతను భార్యను తిట్టడంతో, ఆమె పుట్టింటికి (wife goes to parents’ home) వెళ్లిందని..దీంతో మనస్తాపానికిలోనై నార్సింగి ఫ్లై ఓవర్‌పై నుంచి ఔటర్‌రింగ్ రోడ్డుపైకి దూకి భీమప్ప(25) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా, మద్దురు మండలం, చింతల్‌దిన్నె గ్రామానికి చెందిన బీమప్ప, సత్తమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిరువురు నార్సింగిలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
యూట్యూబ్‌లో వ్యూస్ రావడం లేదని యువకుడు ఆత్మహత్య, నాలాగా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూసైడ్ లెటర్
భీమప్ప రోజు మద్యం తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడు. దాంతో విసిగిపోయిన ఆమె సోమవారం రాత్రి నార్సింగిలోనే ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మర్నాడు అక్కడి నుంచి కిషన్‌నగర్‌లోని తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికిలోనైన భీమప్ప మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు