Telangana Shocker: అత్తతో రోజంతా లాడ్జిలో అల్లుడు, మరుసటి రోజు అత్త అనుమానాస్పద మృతి, అల్లుడే గొంతు నులిమి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
ఆ మహిళను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
Khammam, April 18: ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో ఓ పెళ్లయిన మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆ మహిళను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. అరుణ హైదరబాద్‌లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
కాగా ఈనెల 14వ తేదీన అరుణ.. తనకు కడుపులో నొప్పి వస్తోందని, ఆమె సొంత గ్రామం అయిన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఇక ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు (అరుణ భర్త కృష్ణార్జున్‌రావు మేనల్లుడు)తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు.
ఒక రోజంతా అదే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువుపోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు.
సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమిలి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీరను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇందుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.