Lucknow, April 17: ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ నుంచి వస్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పులో తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. జలౌన్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ దారుణం వెలుగుచూసింది.హత్యకు గురైన యువతిని బీఏ సెకండ్ ఇయర్ విద్యార్థి రోషిని అహిర్వార్‌గా(21) గుర్తించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..విద్యార్థిని రామ్ లఖన్ పటేల్ మహావిద్యాలయ కళాశాలలో పరీక్ష రాసి ఇంటికి తిరిగి వస్తోంది. 11 గంటల సమయంలో ఇద్దరు యువకులు బజాజ్ పల్సర్ బైక్‌పై కంట్రీ మేడ్ పిస్తోల్‌తో ఆమె వద్దకు వచ్చారు. వెంటనే వారిలో ఒకరు యువతి తలపై కాల్పులు జరిపారు.దీంతో బాధితురాలు అక్కడిక్కడే మరణించింది. హంతకులు తుపాకీని అక్కడే విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఒకరిని వెంబడించి పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.
(Warning: Disturbing visuals)
Girl Student Shot Dead in broad daylight in Jalaun Uttar Pradesh.
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 17, 2023
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుబడిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు జలౌన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఇరాజ్ రాజా తెలిపారు. కాగా కళాశాల యూనిఫాం ధరించి రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న విద్యార్థినిని, స్థానికులు, పోలీసులు చూస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
మహిళతో అక్రమ సంబంధం, కూతురును కూడా వదలని కామాంధుడు, బెదిరిస్తూ 5 ఏళ్ళ నుంచి దారుణంగా అత్యాచారం
కాల్పుల్లో తమ కుమార్తె చనిపోయిన సంగతి తెలుసుకుని దళిత విద్యార్థిని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. రాజ్ అహిర్వార్ అనే వ్యక్తిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. బీహార్ ప్రభుత్వంలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కూడా ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ చావుపై కూడా గోడీ మీడియా తోడేళ్లు, బీజేపీ సంబరాలు చేసుకుంటారా?’ అని ప్రశ్నించింది.